Employees Agitation:తమ సమస్యలు పరిష్కరించాలనే డిమాండ్‌తో.. ఉద్యోగ సంఘాల జేఏసీ పిలుపు మేరకు రాష్ట్రవ్యాప్తంగా చేపట్టినత ఆందోళన రెండోరోజూ కొనసాగింది. పీఆర్సీ, ఇతర సమస్యలను వెంటనే పరిష్కరించాలంటూ ప్రకాశం జిల్లా ఒంగోలు కలెక్టరేట్ కు ఉద్యోగులు నల్ల బ్యాడ్జీలు ధరించి వెళ్లారు. ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ.. 2018లో రావాల్సిన పీఆర్సీని ఇప్పటికీ అమలు చేయలేదని ఉద్యోగులు మండిపడ్డారు. ప్రభుత్వం పీఆర్సీ నివేదికను బయటపెట్టాలని ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేశాయి. లేపక్షంలో జనవరి 6 వరకు తమ ఆందోళనలు కొనసాగుతాయని జేఏసీ నాయకులు తెలిపారు.
మొదటి రోజు నిరసనలు..
కర్నూలులో ఉద్యోగ సంఘాల నాయకులు నల్లబ్యాడ్జీలు ధరించి ప్రదర్శన నిర్వహించారు. ఈ నిరనస కార్యక్రమంలో ఏపీ జేఏసీ అమరావతి ఛైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. ప్రభుత్వం తమ డిమాండ్లు పరిష్కరించకుంటే.. సమ్మె బాట పడతామని హెచ్చరించారు. ఉద్యోగ సంఘాల్ని అణచివేయాలని చూస్తే.. ఊరుకోబోమన్నారు.