రైతు సమస్యల పరిష్కారం కోసం రైతు భరోసా కేంద్రాలు ఉపయోగపడతాయని ప్రకాశం జిల్లా చీరాల వ్యవసాయ మార్కెట్ కమిటీ ఛైర్మన్ మార్పు గ్రెగోరి అన్నారు. చీరాల మండల వ్యవసాయ శాఖ, మార్కెట్ కమిటీ చీరాల ఆధ్వర్యంలో రైతు భరోసా కేంద్రాల్లో... పచ్చిరొట్ట, జీలుగ, పిల్లి పెసర విత్తనాలను 50 శాతం రాయితీలపై అందచేశారు. ప్రతీ రైతు భరోసా కేంద్రం వద్ద స్మార్ట్ టీవీ, కొన్ని పుస్తకాలు ఉంచడం ద్వారా... రైతులకు వ్యవసాయంలోని సందేహాలపై అవగాహన కల్పిస్తామని వ్యవసాయ శాఖ అధికారులు తెలిపారు.
రైతు భరోసా కేంద్రాల్లో విత్తనాల పంపిణీ - చీరాలలో విత్తనాల పంపిణీ వార్తలు
ప్రకాశం జిల్లా చీరాలలోని రైతు భరోసా కేంద్రాల్లో 50 శాతం రాయితీపై... రైతులకు విత్తనాలు పంపిణీ చేశారు. చీరాల వ్యవసాయ శాఖ మార్కెట్ కమిటీ ఛైర్మన్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.
రైతు భరోసా కేంద్రాల్లో విత్తనాల పంపిణీ