ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

Crime news: పోలీసుల అదుపులో.. చోరీ నిందితులు - దొంగల అరెస్టు

Crime news: ప్రకాశం జిల్లాలో దొంగతనాలకు పాల్పడిన ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి ఒక ద్విచక్ర వాహనాన్ని, 90 వేల రూపాయలు విలువచేసే బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు.

crime-news
crime-news

By

Published : Dec 17, 2021, 8:31 PM IST

ప్రకాశం జిల్లా, కొమరోలులో, దొంగతనాలకు పాల్పడుతున్న ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రెండు వేర్వేరు సంఘటనల్లో చోరీలకు పాల్పడ్డ నిందితులను అదుపులోకి తీసుకోవడంతోపాటు ఒక ద్విచక్ర వాహనాన్ని, 90 వేల రూపాయలు విలువచేసే బంగారాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

డీఎస్పీ కిషోర్​ కుమార్​ వెల్లడించిన వివరాల మేరకు..
ఇటీవల పురుషోత్తముని పల్లి గ్రామ సమీపంలో శ్రీనివాసులు అనే వ్యక్తి ద్విచక్రవాహనంపై వచ్చి మహిళ మెడలో బంగారు గొలుసును దొంగిలించారు. అదే విధంగా ముక్తాపురం లోని పీర్ల చావిడి వద్ద ఉంచిన ద్విచక్ర వాహనాన్ని దొంగిలించిన ఇండ్ల రాజశేఖర్, బిల్లా హరికృష్ణ అపహరించారు. వీరిని పట్టుకుని రిమాండ్​కు తరలించినట్లు డీఎస్పీ కిషోర్ కుమార్​ తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details