ప్రస్తుతం కొవిడ్ తీవ్రత ఎక్కువగా ఉందని, పాజిటివ్ రోగులకు మెరుగైన వైద్య సేవలందించాలని కొవిడ్ జిల్లా ప్రత్యేకాధికారి సిసోడియా ఆదేశించారు. ప్రకాశం జిల్లా చీరాలలోని ఆసుపత్రిని ఆయన పరిశీలించారు. సేవల గురించి పర్యవేక్షకులు శేషుకుమార్ను అడిగి తెలుసుకున్నారు. రోగులకు సకాలంలో వైద్యం అందించి ధైర్యాన్ని నింపాలన్నారు. ఆసుపత్రిలో వైద్య పరీక్షలు, ఆక్సిజన్ తదితర వసతులపై ఆరా తీశారు. చీరాలలోని కట్టడి జోన్లను పరిశీలించారు.
చీరాల ప్రభుత్వ ఆసుపత్రిని తనిఖీ చేసిన కొవిడ్ ప్రత్యేక అధికారి
ప్రకాశం జిల్లా చీరాలలోని ఆసుపత్రిని కొవిడ్ జిల్లా ప్రత్యేకాధికారి సిసోడియా పరిశీలించారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ.. రోగులకు సకాలంలో వైద్యాన్ని అందించి... ధైర్యాన్ని అందించాలన్నారు.
చీరాల ప్రభుత్వ ఆసుపత్రిని తనిఖీ చేసిన కొవిడ్ ప్రత్యేక అధికారి