పాల లారీ-ద్విచక్రవాహనం ఢీకొన్న సంఘటనలో.. మార్టూరు వ్యవసాయ మార్కెట్లో తాత్కాలిక ఉద్యోగిగా పనిచేస్తున్న భావన్నారాయణ అనే యువకుడు మృతిచెందాడు. విజయవాడ నుంచి ఒంగోలు వైపు వస్తున్న పాల లారీ… చిలకలూరిపేట నుంచి వలపర్లకు ద్విచక్రవాహనంపై వస్తున్న భావన్నారాయణ (24)ను ఢికొట్టింది. క్షతగాత్రుడిని మార్టూరు ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ అతను మృతిచెందాడు. విషయం తెలుసుకున్న మృతుడి కుటుంబసభ్యులు ఆసుపత్రికి చేరుకుని విలపించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
రోడ్డు ప్రమాదంలో తాత్కాలిక ఉద్యోగి మృతి - contract employee died in accident news
పాల లారీ-ద్విచక్రవాహనం ఢీకొన్న ప్రమాదంలో.. మార్టూరు వ్యవసాయ మార్కెట్లో తాత్కాలిక ఉద్యొగిగా పనిచేస్తున్న భావన్నారాయణ మృతిచెందాడు.
contract employee died in accident