పెట్రోల్, డీజిల్ రేట్ల పెంపునకు వ్యతిరేకంగా ప్రకాశం జిల్లా యర్రగొండపాలెంలో కాంగ్రెస్ నేతలు నిరసన చేపట్టారు. పెట్రోల్, డీజిల్ ధరల పెంపుతో సామాన్యులు అవస్థలు పడుతున్నారని అన్నారు.
నెలలో 13 సార్లు రేట్లు పెంచారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్నంటాయని అన్నారు. కరోనా బాధితులకు పౌష్టికాహారం సమకూర్చలేని దుస్ధితిలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉన్నాయని విమర్శించారు.