చలివేంద్రాల్లో సేదతీరుతున్న శునకాలు - చలివేంద్రాల్లో సేదతీరుతున్న శునకాలు
పేరుకే చలివేంద్రం అందులో శునకరాజులు నిలయం ఉంటున్నాయి. ప్రతీ గ్రామానికి రెవెన్యూశాఖ ఆధ్వర్యంలో చలివేంద్రాలు ఏర్పాటు చేయాలని ప్రకాశం జిల్లాకలెక్టర్ వినాయచంద్ రెవెన్యూశాఖ అధికారులకు ఆదేశాలు జారీచేశారు. కానీ అవి ఉపయోగకరంగా లేకపోవటంతో శునకాలు అక్కడే సేద తీరుతున్నాయి.
ప్రకాశం జిల్లా కలక్టర్ వారిఆదేశాల మేరకు ...ప్రజల ప్రజలసౌకర్యార్థం అధికారులు చలివేంద్రాలను ఏర్పాటు చేశారు. దొనకొండమండలం గంగదేవపల్లిలో రెవెన్యూ అధికారులు చలివేంద్రం ఏర్పాటు చేశారు. కానీ అక్కడ మంచి నీరు అందించే దాఖలాలు కనిపించడంలేదు. ఈ చలివేంద్రం దర్శి నుంచి దొనకొండ వెళ్లే రహదారిలో గంగదేవపల్లి బస్‌స్టాప్ వద్ద ఏర్పాటు చేశారు. చలివేంద్రంలో కనీసం నీళ్ల కుండలూ లేవు. అక్కడ శునకాలు సెదతీరుతున్నాయి. జిల్లాకలెక్టర్ ఆదేశాల అమలుచేయడంలో అధికారులు ఎంత నిర్లక్ష్యంగా ఉన్నారని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు.