ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Aug 3, 2020, 9:23 AM IST

Updated : Aug 3, 2020, 7:16 PM IST

ETV Bharat / state

బతికుండగానే శ్మశానానికి!

మరికొన్ని గంటల్లో చనిపోతాడని వైద్యులు ధ్రువీకరించడంతో ఓ వ్యక్తికి కొన ఊపిరి ఉండగానే ఆసుపత్రి నుంచి నేరుగా శ్మశానానికి తీసుకొచ్చిన సంఘటన ప్రకాశం జిల్లా కందుకూరులో జరిగింది. ఆస్పత్రిలో చికిత్స అందించిన వైద్యులు ప్రయోజనం లేదని ఇంటికి తీసుకెళ్లమని తెలిపారు. మరి కొద్ది గంటల్లో చనిపోయే వ్యక్తిని.. అద్దెకు ఉంటున్న ఇంటికి తీసుకెళితే వారు ఏమంటారోనన్న అపోహతో..నేరుగా శ్మశానానికి తీసుకెళ్లారు.

cemetery while
cemetery while

స్థానికులు తెలిపిన మేరకు.. కందుకూరులో నివసిస్తున్న పి.వెంకటేశ్వర్లు(55) రెండు రోజులు క్రితం ఇంట్లో జారిపడ్డారు. తలకు గాయం కావడంతో ఆసుపత్రిలో చికిత్స చేయించుకుని అదే రోజు ఇంటికొచ్చారు. శనివారం పరిస్థితి విషమించడంతో కుటుంబ సభ్యులు ఒంగోలులో ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ ఒక రోజు వైద్యం అందించారు. ఆ తర్వాత రోగి ఆరోగ్యం పూర్తిగా క్షీణించిందని, వైద్యం అందించినా ప్రయోజనం లేదని వైద్యులు కుటుంబ సభ్యులకు తెలిపారు.

దీంతో వారు రోగిని తీసుకుని ప్రైవేటు అంబులెన్స్‌లో కందుకూరు వచ్చారు. వారు ఉండేది అద్దె ఇల్లు కావడంతో యజమానులు నిరాకరిస్తారని అపోహపడి నేరుగా శ్మశానం పక్కనే ఉన్న ఆరామక్షేత్రానికి తీసుకెళ్లారు. ఎలాగూ మరికొద్ది సేపట్లో చనిపోతాడని భావించిన బంధువులు ఖననం చేసేందుకు ఏర్పాట్లు మొదలు పెట్టారు. దీన్ని గమనించిన స్థానికులు వ్యక్తి బతికుండగానే ఏవిధంగా ఏర్పాట్లు చేస్తున్నారని కుటుంబ సభ్యులతో వాగ్వాదానికి దిగారు. ఈ విషయం బయటకు రావడం, విలేకరులు అక్కడికి చేరుకోవడంతో.. చేసేది లేక రోగిని పట్టణంలోని ఓ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ ఆదివారం సాయంత్రం మృతిచెందాడు.

cemetery-while-still-alive-in-prakasam-district

ఇదీ చదవండి:కేరళ బంగారం కేసులో మరో ఆరుగురు అరెస్టు

Last Updated : Aug 3, 2020, 7:16 PM IST

ABOUT THE AUTHOR

...view details