తన కుమారుడిపై కుట్రపూరితంగా కేసులు పెట్టారని చీరాల వైకాపా నాయకుడు ఆమంచి కృష్ణమోహన్ సోదరుడు స్వాములు ఆరోపించారు. ఒంగోలులో అనుచరులతో కలిసి జిల్లాఎస్పీని కలిశారు. చీరాలలో గత ప్రభుత్వానికి కొమ్ముకాసి అక్రమాలకు పాల్పడిన కానిస్టేబుళ్లు, హోం గార్డులు, అప్పటి రూరల్ సీఐ పై ఎస్పీ కి ఫిర్యాదు చేశానన్నారు. తన కుమారుడి పై పెట్టిన రెండు కేసులు లెక్కలోకి తీసుకోవాల్సిన అవసరం లేదన్నారు. గత ప్రభుత్వం కక్షపూరిత ధోరణితో ఇంతకంటే ఎక్కువ కేసులు తమపై మోపిందన్నారు.
'కుట్రపూరితంగానే కేసులు పెట్టారు ' - prakasham
చీరాలలో గత ప్రభుత్వం హయంలో అక్రమాలకు పాల్పడిన పోలీసులుపై ప్రకాశం జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేసినట్లు వైకాపా నేత ఆమంచి స్వాములు స్పష్టం చేశారు. తన కుమారుడిపై కుట్రపూరితంగా కేసులు పెట్టారన్నారు.
ఆమంచి కృష్ణమోహన్