ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

రజానగరం గ్రామంలో దారుణ హత్య - prakasham district latest news

ప్రకాశం జిల్లా తాళ్ళూరు మండలం రజానగరం గ్రామంలో దారుణ హత్య జరిగింది. గ్రామానికి చెందిన సుబ్బారెడ్డిని గుర్తుతెలియని వ్యక్తులు మారణాయుధాలతో నరికి చంపారు. ఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు... కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Brutal murder in Rajanagaram village
రజానగరం గ్రామంలో దారుణ హత్య

By

Published : Aug 24, 2020, 1:59 AM IST

ప్రకాశం జిల్లా తాళ్ళూరు మండలం రజానగరం గ్రామంలో ఓ వ్యక్తిని దారుణంగా హత్యచేసిన ఘటన ఆదివారం సాయంత్రం జరిగింది. గ్రామానికి మారాం సుబ్బారెడ్డి (56) దారుణ హత్యకు గురయ్యాడు. ఆదివారం రాత్రి తన భార్య భోజనం పెట్టి... పాలకేంద్రంలో పాలు పోసివస్తానని చెప్పి వెళ్లింది. అప్పటికే పథకం వేసుకున్న గుర్తుతెలియని వ్యక్తులు ఇంట్లోకి ప్రవేశించారు. వారివెంట తీసుకొచ్చిన ఆయుధాలతో దాడి చేశారు. తీవ్రగాయాల పాలైన సుబ్బారెడ్డి... అక్కడికక్కడే మృతిచెందాడు.

ఇంటికి వచ్చిన భార్య తన భర్తను చూసి కేకలు పెట్టింది. కేకలు విని ఇరుగు పొరుగు వారు వచ్చారు. దర్శి సీఐ మోయిన్, తాళ్ళూరు ఎస్సై నాగరాజు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతునికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. వీరిలో ఒకరు అమెరికాలో ఉండగా మరొకరు హైదరాబాద్​లో ఉంటున్నారు.

ఇదీ చదవండీ... కృష్ణా జిల్లాలో తల్లీబిడ్డలు అనుమానాస్పద మృతి

ABOUT THE AUTHOR

...view details