ప్రకాశం జిల్లాలోని యర్రగొండపాలెం నియోజకవర్గంలో వరుణుడు రైతన్నతో దోబూచులాడుతున్నాడు. ఓ పక్క అన్నదాత సాగుకు సిద్ధం అవుతుంటే... మరో పక్క వర్షం కురుస్తుంది. ఖరీఫ్ సీజన్ మొదలై ఐదు వారలైంది. వ్యవసాయ పనులు ముమ్మరంగా జరగాల్సిన సమయంలో... రైతుల్లో నిస్తేజం నెలకొంది. తొలకరి పలకరించిన, ఆశించిన వర్షాలు పడటం లేదు. లోటు వర్షపాతంతో రైతులు వ్యవసాయం చేసేందుకు ధైర్యం చేయలేకపోతున్నారు. వర్షాధారంగా పత్తి నాటే రైతులు పని ప్రారంభించారు. ఇటీవల జల్లులకు భూమి పదునెక్కింది. రైతుల్లో ఆందోళన నెలకొంది. ప్రభుత్వం ఇచ్చే రాయితీ విత్తనాలు తెచ్చుకుంటున్న కర్షకులు... సాగు చేద్దామా లేదా అనే సందిగ్ధంలో ఉన్నారు.
రైతన్నతో దోబూచులాడుతున్న వరుణుడు - యర్రగొండపాలెం నియోజకవర్గం
యర్రగొండపాలెం నియోజకవర్గంలో రైతులు అవస్థలు పడుతున్నారు. హఠాత్తుగా కురుస్తున్న వర్షానికి రైతు సాగు చేయడానికి ధైర్యం చేయట్లేదు. రాయితీ విత్తనాలతో కర్షకులు ఏం చేయాలో తెలియక సందిగ్ధలో ఉన్నారు.
వరుణుడుపై ఆగ్రహంతో రైతన్న