ప్రకాశం జిల్లా బేస్తవారిపేట మండలం చిన్న ఓబినేనిపల్లి గ్రామంలో తండ్రిని.. కొడుకు గొడ్డలితో నరికి హత్య చేసిన ఘటన చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన గోపు సూరారెడ్డి(50).. రోజు తాగొచ్చి ఇంట్లో వారితో గొడవ పడేవారని కుటుంబ సభ్యులు తెలిపారు. చేసిన అప్పులు తీర్చేందుకు పొలం అమ్మి తెచ్చిన డబ్బును సైతం మద్యానికి ఖర్చు చేశాడన్నారు.
దీంతో విసిగిపోయిన సూరారెడ్డి కొడుకు(ఇంటర్ విద్యార్థి).. తన తండ్రిని గొడ్డలితో నరికి హత్యచేసినట్లు పోలీసులు వివరించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి విచారిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.