ప్రకాశం జిల్లా అద్దంకిలో గుర్తు తెలియని వాహనం ఢీ కొట్టడంతో ఓ వ్యక్తి మృతి చెందాడు. మృతుడికి సంబంధించిన వివరాలు వివరాలు తెలియాల్సి ఉంది. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పోస్ట్ మార్టం నిమిత్తం మృతదేహాన్ని అద్దంకి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
పది రోజుల వ్యవధిలో ఇదే ప్రాంతంలో జరిగిన ప్రమాదాల్లో.. ఐదుగురు వరకు మృతి చెందారు. చాలా మంది గాయపడ్డారు. రాత్రి, తెల్లవారుజామున ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి. సంబంధిత అధికారులు చర్యలు చేపట్టి సమస్య పరిష్కరించాలని స్థానికులు కోరుతున్నారు.