నాలుగు నెలల క్రితం క్షుద్ర పూజల నిమిత్తం విష్ణువర్ధన్ అనే యువకుడు ప్రకాశం జిల్లా దొనకొండ మండలంలోని రుద్రసముద్రం గ్రామానికి వచ్చాడు. గ్రామానికి వచ్చిన ఆ యువకుడు ఓ బాలిక పై కన్నేశాడు. ఎలాగోలా ఆ బాలికను లొంగదీసుకోవాలని నిర్ణయించుకున్నాడో ఏమో అంతే ఆ బాలిక తండ్రికి గుప్త నిధుల ఆశ పుట్టించాడు. మీ ఇంట్లో పూజలు చేస్తే గుప్త నిధులు దొరికి ఆర్థికంగా బలపడతారని నమ్మించాడు. అలా పూజలు చేసేందుకు మీ కుమార్తెను నగ్నంగా పూజలో కూర్చోబెట్టాలని కోరాడు.
డబ్బుకు ఆశపడిన తండ్రి సరేనన్నాడు. దాంతో ఆ క్షుద్ర పూజారిలోని క్రూరత్వం బయట పడింది. 15 రోజులుగా ఆ బాలిక పై అత్యా చారానికి తెగబడ్డాడు. బాలిక ఆ విషయాన్ని తండ్రికి చెప్పినా... పూజారి చెప్పినట్లే చేయాలని బాలిక తండ్రి సూచించాడు. చివరకి ఆ యువకుడు గ్రామస్థులకు పట్టుబడ్డాడు. దాంతో చెట్టుకు కట్టేసి దేహశుద్ది చేసి పోలీసులకు అప్పగించారు.
- వైద్య పరీక్షలకు బాలిక