జాతీయ రహదారిపై 174 చక్రాల బాహుబలి వాహనం
ఏకంగా 174 చక్రాలున్న బండి రోడ్డెక్కింది. దానిపై ఓ భారీ పరికరాన్ని పెట్టుకుని చెన్నైకి బయలుదేరింది. ప్రకాశం జిల్లాలో ఆగిన ఈ రైలు లాంటి వాహనాన్ని ప్రజలు ఆసక్తిగా తిలకించారు.
ప్రకాశం జిల్లా అద్దంకి - నార్కెట్పల్లి రహదారిపై చిన్న కొత్తపల్లి సమీపంలో ఓ భారీ వాహనం ప్రజలకు కనువిందు చేసింది. హైదరాబాద్ నుంచి చెన్నై వెళ్తున్న ఈ వాహనానికి 174 చక్రాల అమరికతో ఆశ్చర్యానికి గురి చేసింది. ఈ వాహనం ముందు ఒక ఇంజన్ వెనుక వైపు మరో ఇంజన్ సహాయంతో కదులుతోంది. రోజుకు 70 కిలోమీటర్ల ప్రయాణం సాగుతుంది. గమ్యస్థానానికి 15 రోజుల్లో చేరుకుంటామని వాహన చోదకులు తెలియజేశారు. హైదరాబాద్ నుంచి చెన్నై వరకు రవాణా వ్యయం సుమారు 60 లక్షలు ఉంటుందన్నారు. ఈ వాహనంపై తీసుకువెళ్తున్న విద్యుత్ పరికరం విలువ రూ.50 కోట్లకు పైగా ఉంటుందని వెల్లడించారు.
TAGGED:
baahubali vechile