ప్రకాశం జిల్లా పోలీస్ పరేడ్ గ్రౌండ్‌లో 72వ గణతంత్ర వేడుకలు ఘనంగా జరిగాయి. కలెక్టర్ పోల భాస్కర్ త్రివర్ణ పతాకం ఆవిష్కరించి, పోలీస్‌ల గౌరవ వందనాన్ని స్వీకరించారు. జిల్లా అభివృద్ధిని ప్రతిబింబించే శకటాల ప్రదర్శన అబ్బురపరిచింది. విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతి కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. స్వాతంత్ర సమరయోధులు, దివంగత ముఖ్యమంత్రి టంగుటూరి ప్రకాశం పంతులు మనవడు గోపాలకృష్ణను కలెక్టర్ ఘనంగా సన్మానించారు.
చీరాల మున్సిపల్ కార్యాలయంలో గణతంత్ర వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ పోతుల సునీత పాల్గొన్నారు. అనంతరం వివిధ ప్రభుత్వ శాఖలలో విశేష సేవలందించిన వారికి ప్రశంస పత్రాలను బహుకరించారు.