గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం మృతి పట్ల పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రపంచం గర్వించే అరుదైన గాయకుడు ఇలా దూరమవడం తనను తీవ్రంగా కలచివేసిందన్నారు. పాట కోసమే పుట్టిన మహానుభావుడు ఎస్పీ అని కొనియాడారు. ఆయన లేని లోటు మరే గాయకుడు పూడ్చలేనిదని మంత్రి పేర్కొన్నారు.
గాయకుడిగా, మంచి నటుడిగా, డబ్బింగ్ ఆర్టిస్ట్‌గా బహుముఖ ప్రజ్ఞ కలిగిన బాలసుబ్రహ్మణ్యం కారణ జన్ములుగా మంత్రి మేకపాటి అభివర్ణించారు. ఆయన భౌతికంగా దూరమైనా 'పాట'లో మనతో శాశ్వతంగా ఉంటారని మంత్రి పేర్కొన్నారు.
16 భాషలలో 40 వేలకుపైగా మధురమైన పాటలు పాడి అరుదైన ఘనత సాధించారు ఎస్పీ బాలసుబ్రమణ్యం. ఆయన మనతో ఉండకపోవచ్చు కానీ... ఆయన పాడిన పాటలు తరతరాలు నిలుస్తాయి. బాలు కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి-విజయసాయి రెడ్డి, వైకాపా ఎంపీ