నెల్లూరు జిల్లా గూడూరు నియోజకవర్గ ఎమ్మెల్యే వరప్రసాద్ ఇంటివద్ద తీవ్ర ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఎమ్మెల్యే అవినీతికి పాల్పడుతున్నారంటూ..వైకాపా శ్రేణులు పెద్ద సంఖ్యలో ఆయన ఇంటివద్దకు తరలివచ్చారు. ఎమ్మెల్యే తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆయన వైఖరిని నిలదీశారు. ఈ క్రమంలో వైకాపా నాయకులు, కార్యకర్తల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు పరిస్థితి ఉద్రిక్తంగా మారకుండా చర్యలు చేపట్టారు.
వైకాపా ఎమ్మెల్యే వరప్రసాద్‌కు షాక్..నిలదీసిన సొంత పార్టీ శ్రేణులు
నెల్లూరు జిల్లా గూడూరు నియోజకవర్గ ఎమ్మెల్యే వరప్రసాద్‌పై సొంత పార్టీ శ్రేణులు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. నియోజకవర్గంలో ఎమ్మెల్యే అవినీతికి పాల్పడుతున్నారని ఆరోపించారు.
ycp cadre protest at gudur mla varaprasad