నెల్లూరులోని పాఠశాలలను రాష్ట్రంలోనే రోల్ మోడల్‌గా తీర్చిదిద్దుతామని జలవనరుల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ స్పష్టం చేశారు. నగరంలోని కే.ఏ.సి. జూనియర్ కళాశాలను పరిశీలించిన ఆయన జిల్లాలో గల పాఠశాలలు, కళాశాలల్లో అన్ని మౌలిక వసతులు కల్పిస్తామన్నారు. ముఖ్యమంత్రితో చర్చించి విద్యా వాలంటీర్ల వేతనాన్ని పెంచేందుకు ప్రయత్నిస్తామన్నారు. నిర్మాణంలో ఉన్న కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆలయాన్ని మంత్రి పరిశీలించారు. దాతల సహకారంతో దాదాపు పది కోట్ల రూపాయల వ్యయంతో ఆలయాన్ని నిర్మిస్తున్నారని, వచ్చే ఫిబ్రవరి నాటికి నిర్మాణాన్ని పూర్తి చేసి కుంభాభిషేకం నిర్వహిస్తామని వెల్లడించారు.
'నగరంలోని పాఠశాలలను రాష్ట్రానికి ఆదర్శంగా తీర్చిదిద్దుతాం' - minister anil
నెల్లూరు జిల్లాలో జలవనరుల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ పర్యటించారు. జిల్లాలోని పాఠశాలలను రాష్ట్రంలోనే రోల్ మోడల్‌గా తీర్చిదిద్దుతామన్నారు.
మంత్రి అనిల్ కుమార్ యాదవ్