నెల్లూరు జిల్లాలోని కండలేరు జలాశయానికి జల కళ వచ్చింది. 51ఎంసీల నీటి మట్టానికి చేరువకావడంతో ఆనందం వ్యక్తం అవుతోంది. 40 ఏళ్లలో తొలిసారి రికార్డుస్థాయిలో 60 టీఎంసీల నీరు నిల్వ చేసేందుకు జలవనరుల శాఖ సిద్ధమైంది.
కండలేరు జలాశయానికి జల కళ
నెల్లూరు జిల్లాలోని కండలేరు జలాశయం నిండుకుండాల ఉంది. 40 ఏళ్లలో తొలిసారి రికార్డుస్థాయిలో 60 టీఎంసీల నీరు నిల్వ చేసేందుకు జలవనరుల శాఖ సిద్ధమైంది.
కండలేరు జలాశయానికి జల కళ
ఓ వైపు స్పిల్వే పనులు సమస్యగా మారాయి. స్పిల్వే దగ్గర కట్ట పోసి నీటి నిల్వకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. రేగడిపల్లి, గుండవోలు తదితర గ్రామాలు ముంపునకు గురవుతున్నాయి. పునరావాసానికి పరిహారం అందక గ్రామస్థులు ఇబ్బంది పడుతున్నారు.
ఇదీ చదవండి: తెలుగు రాష్ట్రాల జలవివాదం: క్రియాశీలకం కానున్న కృష్ణాబోర్డు