ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

దాడికి గురైన మహిళా ఉద్యోగిని పరామర్శించిన రాష్ట్ర మహిళా కమిషనర్ - మహిళా ఉద్యోగిని దాడి

మహిళా ఉద్యోగిపై దాడి చేసిన ఏపీ టూరిజం డిప్యూటీ మేనేజర్ భాస్కర్​ను కఠినంగా శిక్షిస్తామని రాష్ట్ర మహిళా కమిషనర్ వాసిరెడ్డి పద్మ తెలిపారు. దాడికి గురైన ఉద్యోగినిని పరామర్శించిన ఆమె.. నిందితుడిపై నిర్భయ కేసు నమోదు చేస్తామన్నారు.

'మహిళా ఉద్యోగిని దాడి నిందితుడిపై నిర్భయ కేసు'
'మహిళా ఉద్యోగిని దాడి నిందితుడిపై నిర్భయ కేసు'

By

Published : Jun 30, 2020, 10:02 PM IST

నెల్లూరు జిల్లా ఏపీ టూరిజంలో కార్యాలయంలో దాడికి గురైన ఉద్యోగినిని రాష్ట్ర మహిళా కమిషనర్ వాసిరెడ్డి పద్మ పరామర్శించారు. ఆమెపై జరిగిన దాడి వివరాలు తెలుసుకున్నారు. విచక్షణ కోల్పోయి మహిళా ఉద్యోగిపై ఇనుప రాడ్​తో దాడిచేసిన ఏపీ టూరిజం డిప్యూటీ మేనేజర్ భాస్కర్​ను కఠినంగా శిక్షిస్తామని ఆమె తెలిపారు. దీనిపై పూర్తి విచారణ జరిపి 21 రోజుల్లో భాస్కర్​పై నిర్భయ కేసు నమోదు చేస్తామన్నారు. మహిళలపై దారుణంగా ప్రవర్తిస్తున్న పురుషులపై జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుందని పద్మ తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details