ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డికి అస్వస్థత.. మెరుగైన వైద్యం కోసం చెన్నైకి తరలింపు - నెల్లూరు వైఎస్సార్సీపీకి ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి

Udayagiri ysrcp MLA: నెల్లూరు జిల్లా వైఎస్సార్సీపీకి చెందిన ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి అస్వస్థతకు గురయ్యారు. నెల్లూరులో ప్రథమ చికిత్స అందించి మెరుగైన వైద్యం కోసం చెన్నైకి తరలిస్తున్నారు.

Etv Bharat
Etv Bharat

By

Published : Feb 8, 2023, 3:26 PM IST

Updated : Feb 8, 2023, 7:45 PM IST

Udayagiri ysrcp MLA: నెల్లూరు జిల్లా వైఎస్సార్సీపీకి చెందిన ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి అస్వస్థతకు గురయ్యారు. మంగళవారం రాత్రి ఛాతీలో అసౌకర్యంగా ఉందని చెప్పడంతో కుటుంబసభ్యులు ఆయన్ను నెల్లూరులోని అపోలో ఆస్పత్రికి తరలించారు. పరీక్షలు నిర్వహించిన వైద్యులు.. చంద్రశేఖర్‌రెడ్డి గుండె రక్తనాళాల్లో రెండుచోట్ల పూడికలు ఉన్నట్లు గుర్తించారు. ప్రస్తుతం నెల్లూరులోనే ఉన్న ఆయనను మెరుగైన చికిత్స కోసం చెన్నై ఆస్పత్రికి తరలించనున్నట్లు కుటుంబసభ్యులు తెలిపారు. తన ఆరోగ్యం బాగుందని, రెండు రోజుల్లో తిరిగి వచ్చేస్తానని మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి అన్నారు.

మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డికి అస్వస్థత.. మెరుగైన వైద్యం కోసం చెన్నైకి తరలింపు
Last Updated : Feb 8, 2023, 7:45 PM IST

ABOUT THE AUTHOR

...view details