ఉదయగిరి సామాజిక ఆరోగ్య కేంద్రంలో సదరం శిబిరం నిర్వహించారు. శిబిరం నిర్వహణలో వైద్యశాల సిబ్బంది అలసత్వ ప్రదర్శించారు. ఫలితంగా వైద్య పరీక్షల కోసం వచ్చిన దివ్యాంగులు అవస్థలుపడ్డారు. గతంలో సదరం శిబిరానికి నెల్లూరుకు వెళ్లేవారు. దివ్యాంగుల అభ్యర్థన మేరకు ఉదయగిరి సామాజిక ఆరోగ్య కేంద్రంలో సదరం శిబిరాన్ని ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు.
ఆత్మకూరు వైద్యశాల నుంచి ఫిజియోథెరపీ, ఆర్థోపెడిక్ వైద్యులు తిరుమల చైతన్య, చంద్రశేఖర్ వచ్చారు. సామాజిక ఆరోగ్య కేంద్రం సూపరింటెండెంట్ ఆధ్వర్యంలో పరీక్షలకు ఏర్పాటు చేయాలి. మధ్యాహ్నం వరకు చేయలేదు. డేటా ఎంట్రీ ఆపరేటర్ అందుబాటులో లేక వైద్య పరీక్షల కోసం వచ్చిన దివ్యాంగులు అవస్థలుపడ్డారు. సిబ్బంది నిర్లక్ష్యం పట్ల దివ్యాంగుల సహాయకులు అసహనం వ్యక్తం చేశారు. జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేస్తామన్నారు.