ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

Traffic jam on Gudur National Highway: వరద కారణంగా జాతీయ రహదారిపై ట్రాఫిక్ జామ్- పరిశీలించిన కలెక్టర్​ - జాతీయ రహదారిపై ట్రాఫిక్ జామ్

Traffic jam on Gudur National Highway: గూడూరు జాతీయ రహదారిపై వరద ప్రవాహానికి వాహనాలు ముందుకు సాగడం లేదు. మూడు వారాలుగా కురిసిన భారీ వర్షాలకు జిల్లాలో వాగులు ,వంకలు ,చెరువులు ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి. జాతీయ రహదారి పరిస్థితిని కలెక్టర్ చక్రధర్ బాబు పరిశీలించారు.

వరద
వరద

By

Published : Dec 1, 2021, 6:50 PM IST

వరద కారణంగా జాతీయ రహదారిపై ట్రాఫిక్ జామ్

Traffic jam on Gudur National Highway: నెల్లూరు జిల్లా గూడూరు సమీపంలో జాతీయ రహదారిపై వరద ప్రవాహానికి వాహనాలు ముందుకు సాగడం లేదు. జాతీయ రహదారి పరిస్థితిని కలెక్టర్ చక్రధర్ బాబు పరిశీలించారు. వరద కారణంగా ఏర్పడ్డ ట్రాఫిక్ జామ్​ను పరిశీలించారు. కలెక్టర్​ చక్రధర్ బాబు, ఎమ్మెల్యే వరప్రసాద్​తో కలసి వరద నీటిలో లారీలో ప్రయాణం చేశారు. మూడు వారాలుగా కురిసిన భారీ వర్షాలకు జిల్లాలో వాగులు ,వంకలు ,చెరువులు ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయని కలెక్టర్​ అన్నారు. జాతీయ రహదారిపై వరద కారణంగా ఏర్పడ్డ ట్రాఫిక్​ను క్లియర్ చేయడానికి అన్ని విధాలుగా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ట్రాఫిక్​లో చిక్కుకున్న వారికి ఆహారం, తాగునీరు అందిస్తున్నామన్నారు. జిల్లాలో వరద కారణంగా లోతట్టు ప్రాంతాలకు చెందిన సుమారు 4800 మందిని పునరావాస కేంద్రాలకు తరలించి వారికి అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నామన్నారు.

ABOUT THE AUTHOR

...view details