ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'పాఠ్య పుస్తకాలపై ముఖ్యమంత్రి ఫొటోలు ఎందుకు..?' - పాఠ్యపుస్తకాలపై ముఖ్యమంత్రి ఫొటోలు

పాఠ్య పుస్తకాలపై ఫొటోలు ముద్రించుకునేంత ఘనత ముఖ్యమంత్రి ఏమి సాధించారని టీఎన్​ఎస్​ఎఫ్ నెల్లూరు జిల్లా అధ్యక్షుడు తిరుమలనాయుడు ప్రశ్నించారు.

TNSF Angry over CM photos on Books
తిరుమలనాయుడు

By

Published : Jun 21, 2020, 7:18 PM IST

పాఠ్యపుస్తకాలపై ముఖ్యమంత్రి ఫొటోలను తొలగించాలని టీఎన్ఎస్​ఎఫ్ డిమాండ్ చేసింది. పాఠ్య పుస్తకాలపై ఫొటోలు ముద్రించుకునేంత ఘనత ముఖ్యమంత్రి ఏమి సాధించారని టీఎన్ఎస్​ఎఫ్ నెల్లూరు జిల్లా అధ్యక్షుడు తిరుమలనాయుడు ప్రశ్నించారు. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న వారి ఫొటోలు ముద్రిస్తే... వారిని విద్యార్థులు ఆదర్శంగా తీసుకోవాలా అని ప్రశ్నించారు. పాఠ్య పుస్తకాలపై సీఎం జగన్ ఫొటోల ముద్రణ నిలిపి వేసి... ఇప్పటికే పంపిణీ చేసిన పుస్తకాల స్థానంలో కొత్తవి ఇవ్వాలని డిమాండ్ చేశారు. వైకాపా ప్రచారానికి పుస్తకాలను వాడుకోవడం సరికాదని హితవు పలికారు.

ABOUT THE AUTHOR

...view details