ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

Jindal Steel and Power: జిందాల్‌ స్టీల్‌ ప్లాంట్​కు 860 ఎకరాల భూముల కేటాయింపు

రిటైల్‌ రంగంలో 2026 నాటికి రూ.5 వేల కోట్ల కొత్త పెట్టుబడులను ఆకర్షించి..50 వేల మందికి ప్రత్యక్ష ఉపాధి కల్పించాలన్నదే లక్ష్యమని ప్రభుత్వం పేర్కొంది. ఏపీ రిటైల్‌ పార్కు 2021-26 పాలసీ మార్గదర్శకాలను ఖరారు చేస్తూ గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. ఇందులో భాగంగా.. నెల్లూరు జిల్లాలో జిందాల్‌ సంస్థకు స్టీల్‌ ప్లాంట్‌ ఏర్పాటుకు 860 ఎకరాలను కేటాయించింది.

The government has allotted 860 acres  lands to Jindal's steel plant.
జిందాల్‌ సంస్థకు 860 ఎకరాల భూముల కేటాయింపు

By

Published : Jul 16, 2021, 9:42 AM IST

నెల్లూరు జిల్లా తమ్మినపట్నం, మోమిడి గ్రామాల దగ్గర జిందాల్‌ సంస్థకు స్టీల్‌ ప్లాంట్‌ ఏర్పాటుకు 860 ఎకరాలను కేటాయిస్తూ ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. భూములపై వెచ్చించే మొత్తం కాకుండా రూ.7,500 కోట్ల పెట్టుబడితో ఏటా 2.25 మిలియన్‌ టన్నుల ఉత్పత్తి సామర్థ్యం ఉన్న ఇంటిగ్రేటెడ్‌ స్టీల్‌ ప్లాంట్‌ను జిందాల్‌ సంస్థ ఏర్పాటు చేస్తుంది.

వచ్చే నాలుగేళ్లలో ప్రత్యక్షంగా 2,500 మందికి, పరోక్షంగా 15 వేల మందికి ఉపాధి కల్పించనున్నట్లు సంస్థ పేర్కొంది. ఏపీఐఐసీ మార్గదర్శకాలకు అనుగుణంగా భూముల ధరను సంస్థ చెల్లించాలని, పునరావాసానికి, ఇతర ఖర్చులను సంస్థ భరించాలని ఉత్తర్వుల్లో పేర్కొంది.

ఇదీ చూడండి.రిటైల్‌ రంగంలో రూ. 5 వేల కోట్ల పెట్టుబడులు..ప్రత్యక్ష ఉపాధే లక్ష్యం!

ABOUT THE AUTHOR

...view details