ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పిల్లలకు పాఠాలే కాదు.. పేదలకు సహాయం కూడా !!

రాష్ట్రవ్యాప్తంగా లాక్​డౌన్ కఠినంగా అమలవుతోంది. ఈ నిబంధన కారణంగా కార్మికులు, పేదలు, వలస కూలీలు ఉపాధి కోల్పోయి ఆర్ధికంగా ఇబ్బందులు పడుతున్నారు. వీరి అవస్థను గమనించిన నెల్లూరు జిల్లా ఉదయగిరికి చెందిన ఓ ఉపాధ్యాయుడు కూరగాయలు పంపిణీ చేసి దాతృత్వాన్ని చాటుకున్నారు.

teacher distributed vegetables to the poor peple in udayagiri
పేదలకు కూరగాయలు పంపిణీ చేసిన ఉపాధ్యాయుడు

By

Published : Apr 16, 2020, 11:31 AM IST

నెల్లూరు జిల్లా ఉదయగిరి గాజులవీధికి చెందిన ఉపాధ్యాయుడు గాజుల తాజుద్దీన్ 400 పేద కుటుంబాలకు కూరగాయలు పంపిణీ చేసి దాతృత్వాన్ని చాటుకున్నారు. ఉపాధి కోల్పోయి ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న పేదలకు తన వంతు అండగా నిలిచేందుకు కూరగాయలు పంపిణీ చేశానని తాజుద్దీన్ తెలిపారు. ప్రజలు భౌతిక దూరం పాటించే విధంగా ఏర్పాట్లు చేసి, కూరగాయలు అందజేశారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details