ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'పౌర చట్ట సవరణపై వైకాపా మైనార్టీలను మభ్యపెడుతోంది'

నెల్లూరు జిల్లాలో తెదేపా నేతలు వైకాపా తీరుపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. తమ వ్యక్తిగత ప్రయోజనాల కోసమే తప్పుడు ప్రచారం చేస్తూ మైనారిటీలను మభ్యపెడుతున్నారని తెదేపా రూరల్​ ఇన్​చార్జ్​ అజీజ్ విమర్శించారు. వైకాపా మోసపూరిత తీరుపై నేతలు మండిపడ్డారు.

tdp leaders press meet
మీడియా సమావేశం అనంతరం జవాన్​కు నివాళులర్పించిన తెదేపా నేతలు

By

Published : Jun 19, 2020, 11:04 PM IST


ఎన్​పీఆర్, ఎన్ఆర్​సీలకు వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మానం చేసినట్లు చెబుతున్న వైకాపా ప్రభుత్వం మైనారిటీలను మభ్యపెడుతోందని తెలుగుదేశం పార్టీ ఆరోపించింది. 2010 నాటి ఫార్మేట్ అమలు చేయాలని కేంద్రానికి విజ్ఞప్తి చేస్తూ తీర్మానం చేసిన పాలకులు, ప్రచారం మాత్రం అందుకు విరుద్ధంగా చేస్తున్నారని నెల్లూరులో దుయ్యబట్టారు.

వైకాపా ప్రభుత్వ విధానాలపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తిన నేతలు ఎన్​పీఆర్​లో మార్పులు చేయాలని తీర్మానం చేసి, రద్దు చేసినట్లు ప్రచారం చేయడంలో అంతర్యమేంటని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో తెదేపా నగర, రూరల్ ఇన్​ఛార్జ్ లు కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి, అబ్దుల్ అజీజ్​లు పాల్గొని ఇటీవల చైనా దాడిలో మృతి చెందిన సైనికులకు నివాళులర్పించారు.

ఇవీ చూడండి...

పోలీసుల తనిఖీల్లో గుట్కా, నగదు స్వాధీనం

ABOUT THE AUTHOR

...view details