ఈఎస్ఐ కుంభకోణానికి సంబంధించి ఏసీబీ సమగ్ర దర్యాప్తు చేపట్టాలని తెదేపా డిమాండ్ చేసింది. నెల్లూరులో ఏసీబీ కార్యాలయంలో డీఎస్పీ దేవానంద్ శాంత్రోకి తెదేపా నాయకులు వినతిపత్రాన్ని అందజేశారు. ఈఎస్ఐ కుంభకోణంలో మంత్రి జయరాం పాత్ర ఉందని, ఆయన కుమారుడు ఈశ్వర్ బెంజ్ కారును బహుమతిగా తీసుకున్నట్లు బయటపడిందని తెదేపా నేత కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి ఆరోపించారు. బెంజ్ కారును తీసుకున్న విషయాన్ని కప్పిపుచ్చేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని దుయ్యబట్టారు. తెదేపా నేత అచ్చెన్నాయుడును ఈఎస్ఐ కుంభకోణంలో అనవసరంగా ఇరికించారని మండిపడ్డారు. ఈఎస్ఐ కుంభకోణంలో జయరామ్ పాత్రపై ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
'ఈఎస్ఐ కుంభకోణంలో మంత్రి పాత్రపై ప్రభుత్వం సమాధానం చెప్పాలి' - మంత్రి జయరాం వార్తలు
ఈఎస్ఐ కుంభకోణంలో అచ్చెన్నాయుడును ఉద్దేశపూర్వకంగా ఇరికించారని నెల్లూరులోని తెదేపా నాయకులు అన్నారు. బెంజ్ కారు విషయంలో ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ఏసీబీకి తెదేపా నేతల వినతిపత్రం