పేదలను పతనం చేసే పనిలో వైకాపా ప్రభుత్వం ఉందని నెల్లూరు నగర తెదేపా అధ్యక్షుడు కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి అన్నారు. నెల్లూరులో మాట్లాడిన ఆయన...పేదలకు పంపిణీ చేసే ఇళ్ల స్థలాలను లోతట్టు ప్రాంతాల్లో ఇవ్వటంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తెదేపా హయాంలో కట్టిన ఇళ్లకే అధికార పార్టీ రంగులు వేసుకోవడం దారుణమన్నారు. ఇళ్ల స్థలాల పేరుతో మంత్రులు, ఎమ్మెల్యేలు భారీగా అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు. జమిలి ఎన్నికలు వస్తే తెదేపా అధికారంలోకి వస్తుందని జోస్యం చెప్పారు.
పేదలను పతనం చేసే పనిలో వైకాపా ప్రభుత్వం: కోటంరెడ్డి - కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి తాజా వార్తలు
వైకాపా ప్రభుత్వ తీరుపై నెల్లూరు నగర తెదేపా అధ్యక్షుడు కోటంరెడ్డి శ్రీనివాసులు మండిపడ్డారు. ఇళ్ల స్థలాల పేరుతో మంత్రులు, ఎమ్మెల్యేలు భారీగా అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు.
tdp-leader-kotamreddy-srinivasulu