ఇంకా తగ్గని ఎండ.. ఉక్కిరిబిక్కిరవుతున్న ప్రజలు - summer effect
ఎండ వేడిమి నెల్లూరు జిల్లా ప్రజలను ఇంకా ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. జూన్ నెల వచ్చినా ఎండల దాటి కాస్త కూడా తగ్గకపోవడంతో ఇళ్ల నుంచి బయటకు రావాలంటే ప్రజలు భయపడుతున్నారు.
ఉదయం 8 నుంచి ఎండ వేడి ప్రారంభమవుతోంది. జూన్ నెలలో 40 నుంచి 44 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. తప్పనిసరి పరిస్థితుల్లో బయటికి వచ్చే ప్రజలు టోపీలు, వస్త్రాలు ముఖానికి అడ్డుపెట్టుకొని తిరుగుతున్నారు. శీతల పానీయాలు తాగుతూ ఎండ నుంచి కాస్త ఉపశమనం పొందుతున్నారు. మండుతున్న ఎండల్లో విధులు నిర్వహిస్తున్న పోలీసులకు జిల్లా ఎస్పీ ఐశ్వర్య రస్తోగి ప్రత్యేక చర్యలు చేపట్టారు. రహదారులపై ట్రాఫిక్ నియంత్రించే పోలీసులకు టోపీలతోపాటు కూలింగ్ గ్లాస్లు, వాటర్ బాటిళ్లు అందజేశారు.