ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

నెల్లూరువాసుల దశబ్దాల కల...సోమశిల హైలెవల్ కెనాల్​తో సాకారం

నెల్లూరు జిల్లాలో మెట్టప్రాంతాలను సస్యశ్యామలం చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. మెట్టప్రాంత ప్రజల కల నెరవేరేలా సోమశిల హైలెవల్ కెనాల్ ఏర్పాటు చేస్తున్నారు. కాలువల నిర్మాణాలు పూర్తయితే... ఉదయగిరి, ఆత్మకూరు రెండు నియోజకవర్గాల్లో వలసలు తగ్గనున్నాయి. ప్రజల సాగునీరు, తాగునీటి సమస్యలు తీరనున్నాయి.

నెల్లూరు వాసుల దశబ్దాల కల
నెల్లూరు వాసుల దశబ్దాల కల

By

Published : Nov 10, 2020, 3:54 PM IST

నెల్లూరు జిల్లాలోని ఆత్మకూరు, ఉదయగిరి నియోజకవర్గాల్లో వలసలకు అడ్డుకట్ట వేసేలా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. తీవ్ర దుర్భిక్షం నెలకొన్న ఉదయగిరి, ఆత్మకూరు నియోజకవర్గాలను సస్యశ్యామలం చేసే ప్రణాళికలను సిద్ధం చేశారు. 70 కిలోమీటర్లు దూరంలో సోమశిల రిజర్వాయరు ఉన్నా... కాలువలు లేక సాగుకు, తాగుకు ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రజల కష్టాలను తీర్చడానికి ప్రభుత్వం సన్నద్ధమైంది. అందులో భాగంగా సోమశిల హైలెవల్ కెనాల్​కు ముఖ్యమంత్రి జగన్ సోమవారం శంకుస్థాపన చేశారు. కాలువలను రెండు దశల్లో పూర్తి చేయనున్నారు. దీనికి మెుత్తం వ్యయం రూ.1,497 కోట్లుగా అంచనా వేస్తున్నారు.

హై లెవల్ కాలువలు పూర్తిచేస్తే 2లక్షల ఎకరాలకు సాగునీరు అందనుంది. 2.35లక్షల మందికి తాగునీరు అందించే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. గుండెమడకల, కంపసముద్రం, చాబోలు వద్ద రిజర్వాయర్లు నిర్మించనున్నారు. రిజర్వాయర్లకు ప్రత్యేకంగా రూ.88కోట్లు కేటాయించారు. దుత్తలూరు, వింజమూరు, ఉదయగిరి, మర్రిపాడు మండలాల భూములకు రెండో దశ కాలువల వల్ల సాగునీరు అందుతుందని అధికారులు వెల్లడించారు. ఈ కాలువ పనులు డిసెంబరులో మెుదలుకానున్నాయి.

ABOUT THE AUTHOR

...view details