ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

సోమశిల దిగువ భాగంలో దెబ్బతిన్న ఆప్రాన్.. పట్టించుకోని అధికార యంత్రాంగం

నెల్లూరు జిల్లాలో ప్రధాన జలాశయం సోమశిల జలాశయం. 10 లక్షల ఎకరాలకు సాగునీరు అందించే సోమశిల జలాశయం పరిస్థితి అధ్వానంగా తయారైంది. నీవార్ తుపాన్ ప్రభావంతో జలాశయం నుంచి భారీగా నీరు విడుదల చేయడంతో దిగువ ప్రాంతంలో ఆప్రాన్, ఎడమ గ్యాబిన్ పూర్తిగా దెబ్బతిన్నాయి. దెబ్బతిని ఇప్పటికి నాలుగు నెలలు కావస్తున్నా ఇప్పటివరకు జలవనరుల శాఖ అధికారులు వాటి గురించి పట్టించుకోవడంలేదని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

somashila arfan damage
somashila arfan damage

By

Published : May 20, 2021, 5:53 PM IST

నెల్లూరు జిల్లాకే తలమానికమైన ప్రాజెక్టు సోమశిల. నివర్ తుపాన్ ప్రభావంతో సోమశిల జలాశయానికి భారీగా వరద వచ్చింది. జలవనరుల శాఖ అధికారులు నీటిని దిగువకు వదిలారు. దీంతో ఆప్రాన్, ఎడమ గ్యాబిన్ పూర్తిగా దెబ్బతిన్నాయి. నాలుగు నెలలు కావస్తున్నా జలవనరుల శాఖ అధికారులు పట్టించుకోవడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిపుణుల కమిటీ కూడా వచ్చి పరిశీలించిందని.. ఇప్పటివరకు అధికారులు పట్టించుకోకపోవడం విడ్డూరంగా ఉందని రైతులు అంటున్నారు.

జలాశయంపై ఆధారపడి 20 వేల మంది జీవనం సాగిస్తున్నామని జాలర్లు చెబుతున్నారు. దెబ్బతిన్న చోట త్వరగా మరమ్మతులు చేయాలని మత్స్యకారులు కోరుతున్నారు.

ఇదీ చదవండి:కృష్ణపట్నంలో కరోనా మందు.. పరిశీలిస్తున్న ఆయుష్ నిపుణులు

ABOUT THE AUTHOR

...view details