నెల్లూరు జిల్లా ఆత్మకూరు అటవీ పరిధిలో చేసిన తనిఖీల్లో 194 ఎర్రచందనం దుంగలు పట్టుబడ్డాయి. వాటివిలువ సుమారు 3 కోట్ల రూపాయలు ఉండొచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. కడప నుంచి బద్వేల్ మీదుగా చెన్నైకు వెళుతున్న ఓ లారీ ఆత్మకూరు సమీపంలోని నెల్లూరు పాలెం చెక్ పోస్ట్ వద్ద ఆపకుండా వేగంగా వెళ్లింది. అటవీ అధికారులు దాన్ని వెంబడించడంతో నిందితులు వాహనాన్ని వదిలి పరారయ్యారు.
రూ. 3 కోట్లు విలువ చేసే ఎర్రచందనం దుంగలు పట్టివేత
నెల్లూరు జిల్లా ఆత్మకూరులోని ముంబై జాతీయ రహదారిపై అక్రమంగా తరలిస్తున్న ఎర్రచందనం భారీగా పట్టుబడింది. వాటి విలువ సుమారుగా 3 కోట్లు ఉంటుందని అధికారులు చెబుతున్నారు. కలప లారీని స్వాధీనం చేసుకున్నారు. నిందితుల కోసం గాలిస్తున్నామని జిల్లా అటవీ అధికారి తెలిపారు.
రూ. 3కోట్లు విలువ చేసే ఎర్రచందనం దుంగలు పట్టివేత
అక్రమంగా కలపను తరలిస్తున్న లారీని హరియాణాకు చెందినదిగా జిల్లా అటవీ అధికారి షణ్మఖ కుమార్ గుర్తించారు. నిందితులను పట్టుకునేందుకు గాలిస్తున్నామన్నారు. వాహన యజమానిపై కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు. పెద్ద మొత్తంలో ఎర్రచందనం అక్రమ రవాణాను అడ్డుకున్న ఆత్మకూరు అటవీశాఖ సిబ్బందిని ఆయన అభినందించారు.
ఇదీ చదవండి: