నెల్లూరు జిల్లా సంగం మండలంలోని ఓ గ్రామానికి పెంచల బాబు అనే రౌడీ షీటర్ గత కొన్ని సంవత్సరాలుగా ఓ మహిళతో సహజీవనం చేస్తున్నాడు. ఆ మహిళకు ఒక కుమార్తె ఉంది. శుక్రవారం ఉదయం ఇంట్లో బాలిక ఒంటరిగా ఉన్న సమయంలో పెంచల బాబు..బాలికపై అత్యాచారయత్నానికి పాల్పడ్డాడు. బాలిక కేకలు వేయడంతో చుట్టుపక్కల వారు అక్కడిచి చేరుకున్నారు. బాలిక విషయాన్ని చెప్పడంతో స్థానికులు పెంచల బాబుకు దేహశుద్ధి చేసి పోలీసులకు సమాచారమిచ్చారు.
బాలికపై అత్యాచారయత్నం చేసిన రౌడీషీటర్
సహజీవనం చేస్తున్న మహిళ కుమార్తెపై అఘాయిత్యానికి పాల్పడ్డాడో మృగాడు. ఇంట్లో బాలిక ఒంటరిగా ఉన్న సమయంలో అత్యాచారయత్నం చేశాడు. బాలిక కేకలు పెట్టడంతో స్థానికులు స్పందించి...అతన్ని పట్టుకుని దేహశుద్ధి చేశారు. అనంతరం పోలీసులకు అప్పగించారు.
molest-girl
బుచ్చి సీఐ సురేశ్ బాబు ఘటనా స్థలానికి చేరుకుని పెంచలబాబును అదుపులోకి తీసుకున్నారు. బాలిక చెప్పిన వివరాలతో నమోదు చేసుకుని నిందితుడిపై కేసు నమోదు చేశారు.
ఇదీ చదవండి :ఉదయం కార్లలో తిరుగుతూ రెక్కీ.. రాత్రి గ్యాస్ కట్టర్లతో ఏటీఎం చోరీ