ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

రైతుల సమస్యలపై రౌండ్‌ టేబుల్‌ సమావేశం - Round Table Meeting at nellore news

నెల్లూరు సీపీఎం కార్యాలయంలో రైతు సంఘాల ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ప్యాకేజీ రైతులకు ఉపయోగపడటం లేదని రైతు సంఘాల నాయకులు మండిపడ్డారు.

Round Table Conference on Farmers' Issues at nellore
రైతుల సమస్యలపై రౌండ్‌ టేబుల్‌ సమావేశం

By

Published : May 21, 2020, 9:55 PM IST

కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ప్యాకేజీ అన్నదాతలకు ఉపయోగపడటంలేదని రైతు సంఘాల నాయకులు మండిపడ్డారు. నెల్లూరు సీపీఎం కార్యాలయంలో రైతు సంఘాల ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. కరోనా కష్టకాలంలో రైతులను ఆదుకోవాల్సింది పోయి పరిశ్రమలకు వత్తాసు పలికారని రైతు సంఘాల నేతలు మండిపడ్డారు. కేంద్ర బడ్జెట్ రైతులకు ఎంతో ఉపయోగపడుతుందనుకుంటే నిరాశే మిగిలిందన్నారు. ఈ నెల 27వ తేదీన 250 రైతు సంఘాల ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలిపారు.

ఇదీ చదవండి:

త్వరలో కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం

ABOUT THE AUTHOR

...view details