AP CRIME NEWS : గుంటూరు జిల్లా మేడి కొండూరు మండలంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలం ఒకరు మృతి చెందారు. 20 మందికి గాయాలు అయ్యాయి. మేడి కొండూరు పోలీసులు తెలిపిన మేరకు గుంటూరు నుంచి పల్నాడు జిల్లా నరసరావుపేట వెళుతున్న ఆర్టీసీ బస్ పేరేచర్లలో గల వంతెన పైకి చేరుకుంది. అదే సమయంలో ఎదురుగా వస్తున్న కృష్ణా జిల్లా నిడమనూరుకి చెందిన బిగ్ బాస్కెట్ కొరియర్ సర్వీసుకి చెందిన మినీ లారీ, ఎదురుగా వస్తున్న ఆర్టీసీ బస్ ను ఒక్క సారిగా ఢీ కొట్టింది.
బస్, మీనీ లారీ ముందు భాగం దెబ్బె తిన్నాయి. మినీ లారీ ఒక పక్కకు రోడ్డుకి అడ్డుగా తిరిగింది. మినీ లారీలో ఉన్న సాయి కృష్ణ, రేఖకు తీవ్ర గాయాలయ్యాయి. క్షత గాత్రులను చికిత్స నిమిత్తం 108 వాహనంలో గుంటూరు సర్వజనాస్పత్రి తరలించారు. సాయి కృష్ణ(22) మృతి చెందాడు. బాపట్ల జిల్లా రేపల్లె పట్టణంకు చెందిన సాయి కృష్ణ్ణ ఐదు నెలలుగా విజయవాడలో నివాసం ఉంటున్నాడు. విజయవాడకి చెందిన బిగ్ బాస్కెట్ కోరియర్ సర్వీస్ వాహనానికి డ్రైవర్ గా పని చేస్తున్నాడు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
గోడ మీద పడడంతో ఇద్దరు మృతి :పార్వతీపురం మన్యం జిల్లా కొమరాడ మండలం సర్వపాడు గ్రామంలో గోడ మీద పడడంతో ఇద్దరు మృతి చెందారు. మరో ముగ్గురు గాయపడ్డారు. స్థానికులు పోలీసులు అందించినవివరాల మేరకు గ్రామానికి చెందిన జీలకర్ర మాణిక్యం కొత్తగా ఇల్లు నిర్మించుకోవాలని పాత గోడ కుటుంబీకులు బంధువులతో కలిసి తొలగించేపనులు చేపట్టారు. గోడను కింద నుంచి తవడంతో ఇటీవల కురిసిన వర్షాలకు అది తడిసి ఉండడంతో ఒక వైపు కూలిపోయింది.
పని చేస్తున్న బంధువు శంకర్రావు అక్కడికక్కడే మృతి చెందాడు. మాణిక్యంను 108 వాహనంలో జిల్లా ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గ మధ్యలో ఆమె కన్ను మూసింది. హరికృష్ణతో పాటు గాయపడిన మరో ఇద్దరికి జిల్లా ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. మాణిక్యం భర్త ఏడేళ్ల క్రితం మృతి చెందారు. కొడుకులకు ఇల్లు కట్టాలన్న ఆమె కల నెరవేరకుండానే చనిపోవడంతో కుటుంబంలో తీవ్ర విషాదం అలముకుంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
పాత కక్షలలతో ఇరు వర్గాల మధ్య ఘర్షణ : నెల్లూరు జిల్లా వింజమూరు మండలం శంఖవరం గ్రామంలో పాత కక్షల నేపథ్యంలో ఇరు వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఈ ఘర్షణలో సుమారు పది మందికి గాయాలు అయ్యాయి. నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిని ఆత్మకూరు జిల్లా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. బాధితులు గ్రామంలో పోలాలకి వెళ్ళె రోడ్డు విషయంలో ఇరు వర్గాల మధ్య వివాదం నడుస్తుంది. శ్రీరామ నవమి ఉత్సవాలలో భాగంగా ఉభయ కర్తలుఫ్లెక్సీలు ఏర్పాటు చేసే విషయంలో పాత కక్షలు గోడవలు మనసులో పెట్టుకోని ఇరు వర్గాలు కర్రలు, రాళ్ళతో దాడులకు దిగారు.