"పింఛన్ కోత ఎదురీత" అనే శీర్షికన ఈటీవీ-ఈటీవీ భారత్లో ప్రసారమైన కథనానికి భారీ స్పందన వచ్చింది. నెల్లూరులోని జనార్థనరెడ్డి కాలనీకి చెందిన హజరత్త అనే వ్యక్తి... చెట్టుపై నుంచి పడి.. కాళ్లు చచ్చుపడి నాలుగేళ్లుగా మంచానికే పరిమితమైయ్యాడు. దీంతో కుటుంబ పోషణ కష్టంగా మారింది. వారి దీనస్థితిపై ఈటీవీ కథనాన్ని ప్రసారం చేసింది.
ఈటీవీ-ఈటీవీ భారత్ కథనానికి స్పందన... బాధితుడికి ఆర్థిక సహాయం అందజేత - news updates in nellore
'పింఛన్ కోత ఎదురీత' అనే శీర్షికతో ఈటీవీ-ఈటీవీ భారత్లో ప్రసారమైన కథనానికి భారీ స్పందన లభించింది. మీ కోసం మేము అనే ఫౌండేషన్ సంస్థ... దాతల నుంచి విరాళాలు సేకరించి బాధితుడికి అందించారు.
ఈటీవీ-ఈటీవీ భారత్ కథనానికి స్పందన... బాధితుడికి ఆర్థిక సహాయం అందజేత
ఈ కథనానికి స్పందించిన.. "మీ కోసం మేము" అనే ఫౌండేషన్ సంస్థ.. సామాజిక మాధ్యమాల్లో వీడియోను వైరల్ చేసింది. ఆరు నెలల్లో దాతల నుంచి 9లక్షల రూపాయలు విరాళాలు సేకరించి బాధితులకు అందించింది. దాతల సాయంపై బాధితుడు హర్షం వ్యక్తం చేశాడు.
ఇదీచదవండి.