నెల్లూరు జిల్లా ఉదయగిరి అటవీశాఖ గోదాం నుంచి ఎర్రచందనం దుంగలు దొంగలించిన దుండగులు పట్టుపడ్డారు. దాదాపు 700 కేజీల బరువున్న 28 ఎర్రచందనం దుంగలు ఇటీవల చోరీకి గురయ్యాయి. కేసు నమోదు చేసి దర్యాప్తు చేసిన అధికారులు... బద్వేల్ పట్టణానికి చెందిన ఏడుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వీరు అటవీశాఖ గోదాము నుంచి ఎర్రచందనం దుంగలను దొంగలించి కడప జిల్లా చౌటపల్లి ప్రాంతంలో దాచినట్లు సమాచారం వచ్చిందని... దాడిచేసి పట్టుకున్నామని ఇంఛార్జ్ డీఎఫ్వో మంగమ్మ తెలిపారు. పట్టుబడ్డారిలో ఎక్కువ మంది పాత నేరస్తులేనని చెప్పారు. ఈ చోరీలో అటవీశాఖ సిబ్బంది పాత్ర ఉందన్న ఆరోపణలూ వచ్చాయి.
అటవీశాఖ అధికారుల అదుపులో ఎర్రచందనం దొంగలు - forest officials
ఉదయగిరి అటవీశాఖ గోదాం నుంచి ఎర్రచందనం దుంగలు దొంగలించిన దుండగులను అటవిశాఖ అధికారులు అదుపులోకి తీసుకున్నారు.
అటవీశాఖ అధికారుల అదుపులో ఎర్రచందనం దొంగలు