ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కాలనీల మధ్య కరోనా చిచ్చు... భయం గుప్పిట్లో ప్రజలు - నెల్లూరు జిల్లా వార్తలు

కరోనా వైరస్ పలు గ్రామాల మధ్య చిచ్చు రేపుతోంది. వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండేందుకు ఏర్పాటు చేసిన కంచెల కారణంగా గ్రామాల్లో ఉద్రిక్తత నెలకొంటోంది. నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలంలోని రెండు కాలనీల మధ్య వేసిన కంచెతో ఘర్షణ జరిగింది. ఫలితంగా ఈ కాలనీల ప్రజలు భయంతో కాలం గడుపుతున్నారు.

quarelling two groups in nellore district with corona fence
ప్రభుత్వ పాఠశాలలో ఆశ్రయం పొందుతున్న బాధితులు

By

Published : Apr 27, 2020, 8:36 PM IST

నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలం అనికేపల్లి గ్రామంలో కరోనా రెండు కాలనీల మధ్య చిచ్చు రేపింది. ఈనెల 14 న అంబేడ్కర్ జయంతిని పురస్కరించుకుని.. కొందరు యువకులు పక్కనే ఉన్న చెర్లోపాలెంలో ఆహారం పంపిణీ చేయడం వివాదాస్పదమైంది. గుంపులుగా వచ్చి ఆహారం ఎందుకు పంపిణీ చేస్తున్నారని చెర్లోపాలెం గ్రామస్థులు ప్రశ్నించడంతో ఇరు వర్గాల మధ్య ఘర్షణ నెలకొంది. ఈ ఘటనతో భయభ్రాంతులకు గురైన చెర్లోపాలేనికి చెందిన 30 కుటుంబాలు గ్రామాన్ని వదిలి.. కాశీపురం పాఠశాలలో తలదాచుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. విషయం తెలుసుకున్న పోలీసులు, అధికారులు ఇరు వర్గాలకు సర్దిచెప్పేందుకు యత్నిస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details