ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

1450 గుట్కా ప్యాకెట్లు స్వాధీనం - kaavali

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కావలి పట్టణంలో గుట్కా ప్యాకెట్లను కావలి 2వ పట్టణ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గుట్కా ప్యాకెట్లను కొనుగోలు చేసిన వ్యక్తిని అరెస్టు చేసి కోర్టులో హాజరు పరిచినట్లు పోలీసులు తెలిపారు.

1450 గుట్కా ప్యాకెట్లు స్వాధీనం

By

Published : Aug 19, 2019, 8:29 PM IST

1450 గుట్కా ప్యాకెట్లు స్వాధీనం

నెల్లూరు జిల్లా కావలి పట్టణంలోని 2వ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో గుట్కా ప్యాకెట్లు విక్రయించేందుకు తీసుకోస్తున్న వ్యక్తిని అరెస్టు చేశారు. కావలి పట్టణంలోని కచేరిమిట్ట కు చెందిన శిఖరం వెంకయ్య అనే వ్యక్తి నిషేధిత వస్తువులైన గుట్కాలు అమ్మేందుకు తీసుకొస్తున్నారనే సమాచారంతో పోలీసులు దాడులు నిర్వహించారు. దాడుల్లో 1450 గుట్కా ప్యాకెట్లను స్వాధీన పరుచుకున్నారు. వాటి విలువ సుమారు 30 వేల రూపాయలకు పైగా ఉండవచ్చని సీఐ తెలిపారు. నిషేధిత వస్తువులను విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.

ABOUT THE AUTHOR

...view details