నెల్లూరు జిల్లా చేజర్ల మండలం పెరుమాళ్ళుపాడు గ్రామ సమీపంలోని పెన్నా నది ఒడ్డున ఉన్న వందల ఏళ్ళ నాటి నాగేశ్వరస్వామి దేవాలయం… వరదల కారణంగా ఇసుకమేట వేసి పూర్తిగా నదిలో కూరుకుపోయింది. గ్రామస్థులు తవ్వకాలు జరిపి దేవాలయాన్ని వెలుగులోకి తీసుకొచ్చారు. ఇటీవల ఇసుక మేట వేసిన ప్రాంతం వరకు ఇసుక రీచ్ కొరకు మెటల్ రోడ్డు నిర్మాణం చేపట్టడంతో ఆ ప్రాంతం వరకు రాకపోకలు కొనసాగుతూనే ఉన్నాయి. దీంతో ఇసుక మేటలో కూరుకుపోయి ఉన్న తమ గ్రామానికి చెందిన పురాతన దేవాలయాన్ని వెలికితీసి… అందులో ఉన్న మూలవిరాట్టు కోసం మరో గుడి నిర్మించుకోవాలని గ్రామస్థులు భావించారు.
గ్రామస్థులందరూ ఓ మాట అనుకొని ఇసుక రీచ్ వారి సహాయంతో దేవాలయాన్ని వెతికే పని మొదలుపెట్టారు. మంగళవారం దేవాలయం గోపురం వెలుగులోకి వచ్చింది. ఈ విషయాన్ని గ్రామస్థులు దేవాదాయ శాఖకు, స్థానిక అధికారులకు తెలిపారు.