'తూకాల్లో మోసాలు చేస్తే.. క్రిమినల్ కేసులు వేస్తాం'
నెల్లూరు కూరగాయల మార్కెట్లో తూకాలపై అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టారు. నిబంధనలకు విరుద్ధంగా వ్యాపారం చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
తూకాల్లో వ్యాపారులు మోసాలకు పాల్పడితే కేసులు నమోదు చేస్తామని ఉన్నతాధికారులు హెచ్చరించారు. నెల్లూరు కూరగాయల మార్కెట్లో అమ్మకాలపై మాట్లాడిన మార్కెటింగ్ సెక్రటరీ రామాంజనేయులు.. మార్కెట్ లో ఏర్పాటు చేసిన తూచే యంత్రం.. కాటాను ప్రజలంతా ఉపయోగించుకోవాలని సూచించారు. ఎక్కడ తేడా జరిగినా వెంటనే తమకు ఫిర్యాదు చేయాలని కోరారు. ఈ మేరకు.. ఇద్దరు సిబ్బందిని ప్రత్యేకంగా నియమించామని చెప్పారు. కొందరు వ్యాపారులు మార్కెట్లో దుకాణాలను నిర్ణీత స్థలాన్ని దాటించి ముందుకు తెస్తున్నారని.. అలాంటి వారంతా తీరు మార్చుకోవాల్సిందేనని స్పష్టం చేశారు.