నెల్లూరు జిల్లాలోని డీసీ పల్లి, కలిగిరి పొగాకు వేలం బోర్డును అధికారులు మూసివేశారు. వేలం నిర్వహణ అధికారులకు, అక్కడ పనిచేస్తున్న సిబ్బందికి కరోనా సోకటంతో మూసివేస్తున్నట్లు డీసీ పల్లి పొగాకు బోర్డు వేలం నిర్వహణాధికారి రాజశేఖర్ తెలిపారు. ఈ నెల 31వ తేదీ వరకు పూర్తి కార్యక్రమాలను నిలిపి వేస్తున్నట్లు తెలిపారు. రైతులు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పరిస్థితులను బట్టి తిరిగి ప్రారంభిస్తామని వెల్లడించారు.
కరోనా ఎఫెక్ట్.. డీసీ పల్లి, కలిగిరి పొగాకు వేలం బోర్డుల మూసివేత
నెల్లూరు జిల్లాలోని డీసీ పల్లి, కలిగిరి పొగాకు వేలం బోర్డును అధికారులు మూసివేశారు. ఈ నెల 31న తిరిగి తెరవనున్నట్లు నిర్వహణాధికారి రాజశేఖర్ తెలిపారు.
పొగాకు వేలం బోర్డు