నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం పురపాలక సంఘం పరిధిలో ప్రజలు సేదతీరేలా సుందరమైన పార్కుల ఏర్పాటుకు కమిషనర్ చర్యలు ప్రారంభించారు. పట్టణంలోని బెజవాడ గోపాలరెడ్డి పార్కును 6 నెలల్లో సుందరంగా మార్చారు.
పిల్లలు ఆడుకునేలా.. యువకులు కసరత్తులు చేసుకునేలా.. పెద్దలు సేదతీరేలా అక్కడ ఏర్పాట్లు చేస్తున్నారు. నుడా పరిధిలో మరింత అభివృద్ధి చేసేందుకు 50 లక్షల రూపాయల నిధులు కేటాయించినట్లు కమిషనర్ శ్రీనివాసరావు తెలిపారు.