నెల్లూరు జిల్లా నాయుడుపేట పురపాలక సంఘం ఎల్.ఎ.సాగరం కాలనీలో గురువారం కరోనా పాజిటివ్ కేసు రావడంపై అధికారులు అప్రమత్తమయ్యారు. పాజిటివ్ సోకిన వారికి నెల్లూరులో చికిత్స చేస్తున్నారు. పరిశుభ్రత కోసం సోడియం హైపోక్లోరైడ్ ద్రావణాన్ని రోడ్లపై పిచికారీ చేశారు. దిల్లీ సమావేశానికి వెళ్లిన వారిని నెల్లూరు ఆసుపత్రికి తరలించారు. ఇతరుల వివరాలు తెలుసుకునేందుకు అధికారులు సర్వే చేస్తున్నారు. పాజిటివ్ తేలిన ప్రాంతాల్లో ఎవ్వరినీ లోనికి ప్రవేశించకుండా చర్యలు తీసుకుంటున్నారు.
నాయుడుపేటలోని వ్యక్తికి కరోనా... అధికారులు అప్రమత్తం - corona positive case in nellore district
నాయుడుపేటలో కరోనా పాజిటివ్ కేసు రావడంపై అధికారులు జాగ్రత్త వహించారు. రోడ్లపై సోడియం హైపోక్లోరైడ్ ద్రావణాన్ని పిచికారీ చేశారు. పాజిటివ్ తేలిన ప్రాంతాల్లో ఎవ్వరినీ అనుమతించకుండా చర్యలు తీసుకుంటున్నారు.
నాయుడుపేటలో అప్రమత్తమైన అధికారులు