ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

వీవీప్యాట్ స్లిప్పుల బహిర్గతం- ఇద్దరు అధికారులపై వేటు - వీవీప్యాట్ స్లిప్పుల బహిర్గతం- ఇద్దరు అధికారులపై వేటు

సార్వత్రిక ఎన్నికల్లో అధికారుల నిర్లక్ష్య ధోరణిపై రాష్ట్ర ఎన్నికల సంఘం కొరడా ఝులిపించింది. నెల్లూరు జిల్లా ఆత్మకూరులో వీవీ ప్యాట్ స్లిప్పులు బహిర్గంతతో సీరియస్ అయిన ఈసీ ఇద్దరు అధికారుల సస్పెండ్ చేసింది.

వీవీప్యాట్ స్లిప్పుల బహిర్గతం- ఇద్దరు అధికారులపై వేటు

By

Published : Apr 26, 2019, 1:00 PM IST

నెల్లూరు జిల్లా ఆత్మకూరు సార్వత్రిక ఎన్నికల్లో అధికారుల నిర్లక్ష్యంపై ఏపీ ఎన్నికల సంఘం కొరడా ఝులిపించింది. వీవీ ప్యాట్ స్లిప్పుల బహిర్గతం అక్కడి అధికారుల మెడకు చుట్టుకుంది. ఏకంగా ఎన్నికల నిర్వహణ అధికారులపైన సస్పెన్షన్ వేటు వేసింది.

ఈనెల 15న హై స్కూల్ గ్రౌండ్​లో 115 వ బూత్​కు సంబంధించిన వీవీ ప్యాట్ స్లిప్పులు పడి ఉండటాన్ని గుర్తించిన స్థానికులు అధికారులకు సమాచారం ఇచ్చారు. అక్కడికి చేరుకున్న ఎన్నికల రిటర్నింగ్ అధికారి చిన్న రాముడు వాటిని పరిశీలించి అనంతరం సిబ్బంది చేత వాటిని కాల్చివేశారు. ఈ విషయంపై సీరీయస్ అయిన ఎన్నికల సంఘం... రిటర్నింగ్ అధికారి చిన్న రాముడు( ఆత్మకూర్ ఆర్ డీ ఓ), అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారి విద్యాసాగరుడు( ఆత్మకూర్ ఎమ్మార్వో) పై క్రిమినల్ కేసులు నమోదు చేయించి దర్యాప్తు చేస్తున్నారు.

వీవీప్యాట్ స్లిప్పుల బహిర్గతం- ఇద్దరు అధికారులపై వేటు

ఇవీ చూడండి- విద్యార్థులను బలవంతంగా తీసుకెళ్తే మీదే బాధ్యత

For All Latest Updates

TAGGED:

ec serious

ABOUT THE AUTHOR

...view details