ప్రభుత్వంపై నెల్లూరు జిల్లా తెదేపా నేతలు అసత్య ఆరోపణలు చేస్తున్నారని మంత్రి బాలినేని శ్రీనివాస్‌రెడ్డి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి మండిపడ్డారు. సీజన్లో జిల్లావ్యాప్తంగా 3 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు చేస్తే... దానిపై మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి లేనిపోని ఆరోపణలు చేస్తున్నారన్నారు. గత ప్రభుత్వ హయాంలోనే ధాన్యం కొనుగోలులో అక్రమాలు జరిగాయన్నారు. ప్రభుత్వం వాటిపై విచారణ జరుపుతుందని... వాస్తవాలు తెలితే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.
ధాన్యం కొనుగోళ్లపై తెదేపావి అసత్య ఆరోపణలు: మంత్రి బాలినేని - మంత్రి బాలినేని న్యూస్
నెల్లూరు జిల్లాలో ధాన్యం కొనుగోళ్లపై జిల్లా తెదేపా నేతలు అసత్య ఆరోపణలు చేస్తున్నారని మంత్రి బాలినేని శ్రీనివాస్‌రెడ్డి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి మండిపడ్డారు. గత ప్రభుత్వ హయాంలోనే ధాన్యం కొనుగోలులో అక్రమాలు జరిగాయన్నారు.
ధాన్యం కొనుగోళ్లపై తెదేపా నేతలవి అసత్య ఆరోపణలు