లాక్డౌన్ వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్న పేదలకు నిత్యావసర సరుకులు, ఆహార పొట్లాలు పంపిణీ చేయాలంటే అధికారుల అనుమతి తీసుకోవాలని నెల్లూరు జిల్లా జాయింట్ కలెక్టర్ వినోద్ కుమార్ తెలిపారు. నిబంధనలు పాటించకుండా పంపిణీ కార్యక్రమాలు చేపడితే చర్యలు తీసుకుంటామన్నారు. నెల్లూరు.. జిల్లా పరిషత్ కార్యాలయంలో మాట్లాడిన ఆయన అధికారుల అనుమతితో వారు చెప్పిన ప్రాంతం, సమయంలోనే తగిన జాగ్రత్తలు పాటిస్తూ పేదలకు సహాయం చెయ్యాలని సూచించారు. పాన్ మసాలా, గుట్కాలు నమిలి బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మినా, నిత్యావసర సరుకులను అధిక ధరలకు అమ్మినా చర్యలు తప్పవని హెచ్చరించారు.
దాతలూ... అనుమతులు తప్పనిసరి - నెల్లూరు తాజా వార్తలు
పేదలకు సరుకులను సాయంగా అందించే దాతలు.. అధికారుల అనుమతి తీసుకుని పంపిణీ చేయాలని నెల్లూరు జిల్లా జాయింట్ కలెక్టర్ వినోద్ కుమార్ చెప్పారు. తగిన జాగ్రత్తలు తీసుకుని.. అధికారులు సూచించిన ప్రాంతాలు, నిర్ణీత సమయాల్లోనే పంపిణీ చేయాలన్నారు.
నెల్లూరు జిల్లా జాయింట్ కలెక్టర్ వినోద్ కుమార్