నెల్లూరు జిల్లా నాయుడుపేట పురపాలక సంఘం పరిధిలోని రెడ్ జోన్ ప్రాంతాలను జిల్లా అదనపు జాయింట్ కలెక్టర్ కమలకుమారి అధికారులతో కలిసి పరిశీలించారు. పాజిటివ్ కేసులు సోకిన వారి వివరాలను అడిగి తెలుసుకున్నారు. రెడ్ జోన్ ప్రాంతాల్లో ప్రజలకు అందుతున్న వసతులపై ఆరా తీశారు. బీడీ కాలనీ, బాలాజీ గార్డెన్, ఆర్ముగం నగర్ ముస్లిం వీధుల్లో తిరిగారు. బ్యాంకు వద్ద ఖాతాదారులు ఉండటంతో మేనేజర్‌తో జేసీ మాట్లాడారు. ప్రతిదీ క్షుణంగా తనిఖీ చేశారు.
రెడ్‌జోన్ ప్రాంతాల్లో వసతులపై అదనపు జేసీ ఆరా - nellore news
నాయుడుపేట పురపాలికలోని రెడ్‌జోన్ ప్రాంతాల్లో ప్రజలకు అందుతున్న వసతులపై నెల్లూరు అదనపు జేసీ కమలకుమారి ఆరా తీశారు.
రెడ్‌జోన్ ప్రాంతాల్లో నెల్లూరు అదనపు జేసీ పర్యటన